News
వ్యాధికి చికిత్స మొదలుపెట్టా
ప్రధాని నరేంద్ర మోదీ నల్లధనం అనే వ్యాధికి చికిత్స మొదలుపెట్టానని పేర్కొన్నారు. మన్‌కీ బాత్‌లో భాగంగా మోదీ మాట్లాడారు. 70 ఏళ్లుగా పట్టిపీడిస్తున్న వ్యాధికి చికిత్స అంత సులువు కాదన్నారు. నల్లకుబేరులకు ఒకటే చెబుతున్నా.. పేదల జీవితాలతో ఆటలాడొద్దని హెచ్చరించారు. కఠినమైన బినామీ వ్యతిరేక చట్టం తీసుకొస్తున్నామని స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాల కోసమే నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నామని ఉద్ఘాటించారు. పెద్ద నోట్ల రద్దు వల్ల సమస్యలు వస్తాయని తెలుసన్నారు. ప్రజల బాధలను అర్థం చేసుకున్నానని తెలిపారు. పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ, 50 రోజుల సమయం పడుతుందని ముందే చెప్పానని గుర్తు చేశారు. కేంద్రం, రాష్ర్టాలు, బ్యాంకు, తపాలా సిబ్బంది అధిక సమయం వెచ్చించి విధులు నిర్వరిస్తున్నారని తెలిపారు. ప్రజలకు సేవలందించేందుకు రాత్రింబవళ్లు బ్యాంకు సిబ్బంది పని చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసం చూస్తుంటే తప్పకుండా విజయం సాధిస్తామని నమ్మకం ఏర్పడిందన్నారు. ప్రజలకు ఆర్థిక సేవలు అందిస్తున్న బ్యాంకు, తపాలా ఉద్యోగులు శ్రమిస్తున్న తీరును చూస్తున్నా.. వారు అందిస్తున్న సేవలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. కొంతమంది తమ వద్ద ఉన్న నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలో పేదలను ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. జాతి ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయాన్ని ప్రపంచమంతా గమనిస్తోందన్నారు. దేశం మహత్తర శక్తిగా ఎదగాలన్న కోరిక ప్రజల్లో బలంగా ఉందని స్పష్టం చేశారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








